Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురి మహిళలతో భర్త వివాహేతర సంబంధం, భార్య కూడా అలా చేయడంతో...

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (22:38 IST)
పెళ్ళయి సంవత్సరమే అయ్యింది. ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. అయితే పిల్లలు లేరు. భర్త ప్రభుత్వం ఉద్యోగం. భార్య ఇంటి పట్టునే వుండేది. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో కొందరు మహిళలను లొంగదీసుకున్నాడు భర్త. ఇలా ఒకరిద్దరు కాదు ఐదుగురితో అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. కానీ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

 
కర్నూలు జిల్లా వెల్దురద్ది మండలం గువలకుంట్ల ప్రాంతం. సుధాకర్, బాలలక్ష్మీదేవిలకు సంవత్సరం క్రితమే వివాహం జరిగింది. సుధాకర్ సచివాలయ సంక్షేమ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. అందుకే కావాల్సినంత కట్నం ఇచ్చి పెళ్ళి చేశారు.

 
అయితే పెళ్ళయిన తరువాత పిల్లలు కలుగలేదు. దీంతో పాటు ఇద్దరి మధ్య మనస్పర్థలు తరచూ వచ్చేవి. దీంతో సుధాకర్ తనకున్న పరిచయాలతో పెళ్ళయి భర్తలను వదిలేసిన మహిళలపై మోజు పెంచుకున్నాడు. ఇలా ఐదుగురితో వివాహేతర సంబంధాన్నే పెట్టేసుకున్నాడు. 

 
ఈ వ్యవహారం కాస్త భార్యకు తెలిసింది. ఇలా చేయొద్దని ప్రాధేయపడింది. అయినా వినిపించుకోలేదు. తను కూడా వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటానని బెదిరించింది. దీంతో మనస్థాపానికి గురయ్యాడు భర్త. ఇంట్లో ఇద్దరి మధ్యా తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. భార్య పుట్టింటికి వెళ్ళిపోగా.. భార్య ఎవరితోనో వెళ్ళిపోతోందన్న అనుమానంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments