Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త ప్రాణాలు తీసిన సీరియల్ చిచ్చు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (10:46 IST)
టీవీల్లో ప్రసారమయ్యే సీరియల్స్ అనేక జంటల కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. తాజాగా ఓ వ్యక్తి ప్రాణాలు కూడా హరించింది. ఈ ఆశ్చర్యకర, విషాదకర ఘటన తమిలనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరులోలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కడంబత్తూరు గ్రామానికి చెందిన అశీర్వాదం (40) అనే వ్యక్తికి భార్య నిషా, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, నిషాకు సీరియల్స్ చూడటం మహాపిచ్చి. అలాగే, భర్తకు కూడా టీవీలో వచ్చే వివిధ కార్యక్రమాలను చూసే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి టీవీలో తనకు నచ్చిన ఓ కార్యక్రమాన్ని చూసేందుకు భార్య చేతిలో ఉన్న టీవీ రిమోట్‌ను ఆశీర్వాదం ఆడిగాడు. ఆ సమయంలో టీవీలో వస్తున్న సీరియల్‌ను చూస్తూ.. రిమోట్ ఇచ్చేందుకు నిరాకరంచింది. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. చివరకు అది కాస్తా ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. 
 
దీంతో ఆగ్రహించిన ఆశీర్వాదం... ఇంటి నుంచి బయటకు వెళ్లిపోగా, నిషా సమీపంలో ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం వేకువజామున ఇంటికి చేరుకున్న ఆశీర్వాదం తన గదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఉదయాన్నే ఇంటికి చేరుకున్న నిషా... భర్త ఉరికి వేలాడడం చూసి నిర్ఘాంతపోయింది. బోరున విలపిస్తూ కడంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments