Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రద్ధా వాకర్‌ను హత్యచేసి చికెన్ రోల్ తెప్పించుకుని ఆరగించిన నిందితుడు

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (09:35 IST)
గత యేడాది దేశ రాజధానిలో జరిగిన శ్రద్ధా వాకర్ (27) హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఆప్తాబ్ గురించి పోలీసులు తయారు చేసిన చార్జిషీటులో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన ప్రియురాలైన శ్రద్ధాను హత్య చేసిన తర్వాత అఫ్తాబ్ జొమాటోలో చికెన్ రోల్స్ తెప్పించుకుని ఆరగించినట్టు అందులో పేర్కొన్నారు. 
 
శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు మొత్తం 6629 పేజీలతో కూడాన చార్జిషీటును తయారు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇందులో పోలీసులు అనేక విస్తు గొలింపే విషయాలను ప్రస్తావించారు. గతనెలాఖరులో కోర్టుకు సమర్పించిన ఈ చార్జిషీటులో మొత్తం 150 మంది సాక్షులను విచారించారు.
 
ముఖ్యంగా, శ్రద్ధా హత్య జరిగిన రోజున ఆమె ప్రియుడైన నిందితుడు అఫ్తాబ్ (28) జొమాటోలో చికెన్ రోల్స్ తెప్పించుకుని ఆరగించాడు. అంతేకాకుండా, హత్య చేసిన తర్వాత శ్రద్ధా శవాన్ని ముక్కలుగా నరికి కాల్చి, ఎముకలను స్టోన్ గ్రైండర్‌ ద్వారా పొడిచేసి విసిరేసినట్టు పోలీసులను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. 
 
పైగా, అప్తాబ్‌కు అనేక మంది స్నేహితురాళ్లు ఉన్నారని, బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా పలువురు అమ్మాయిలతో అతడు చనువుగా ఉండేవాడని పోలీసులు తమ చార్జిషీటులో పేర్కొన్నారు. ఈ కేసులో జరిపిన శాస్త్రీయ పరీక్షల్లో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. 
 
మరోవైపు, మంగళవారం అఫ్తాబ్‌ను కోర్టుకు తీసుకువచ్చినపుడు పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ సాయంతో పటిష్ఠమైన భద్రత కల్పించారు. తలుపులు మూసిన కోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తి అవిరళ్‌ శుక్లా కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments