ఆస్తి కోసం భర్తను హత్య చేయించిన భార్య.. ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (18:05 IST)
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తలకు వారి భార్యల నుంచే ప్రాణాపాయం పొంచివుంది. అక్రమ సంబంధాలు పెట్టుకున్న పలువురు మహిళలు.. తమ ప్రియులతో చేతులు కలిపి భర్తలను హత్య చేస్తున్న విషయం తెల్సిందే. అయితే, గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల పలకలూరు గ్రామంలో ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే భార్య హత్య చేయించింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పలకలూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ గోవింద రాజులు (40)కు, లక్ష్మీ అనే మహిళతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భర్తతో గొడవపడి ఆరేళ్లుగా లక్ష్మి విడిగా ఉంటోంది.  కొంతకాలంగా వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 18న సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లిన గోవింద రాజులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 
 
అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడి కొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. ఆస్తి కోసం ప్రియుడితో కలిసి భార్య లక్ష్మి.. గోవిందరాజును హత్య చేయించించినట్లు నిర్ధారించారు. అనంతరం హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. గోవిందరాజుకు మద్యం తాగించి వెంకటేశ్వర్లు, ఖాసిం సైదా హత్య చేశారని ఎస్పీ తెలిపారు నిందితులు ఉపయోగించిన ఆటో ద్వారా ముగ్గురిని పట్టుకున్నామని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments