Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో దారుణం : తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (13:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. ఇప్పటికే నాలుగైదు అత్యాచార కేసులు జరిగాయి. ఇవి సంచలనంగా మారాయి. ఈ కేసుల గురించి స్థానికులు ఇంకా మరిచిపోకముందే ఇపుడు మరో బాలిక అత్యాచారానికి గురైంది. ఇన్‌స్టా ఖాతాలో పరిచయమైన తొమ్మిదేళ్ళ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. పీకల వరకు మద్యం తాగించి తనతో పాటు తన స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా రేపల్లె గురజాలలో నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన డి.గ్రేస్ బాబు అనే యువకుడికి ఇన్‌స్టా ఖాతా ద్వారా ఓ యువతి పరిచమైంది. ఆ యువకుడి మాటలు నమ్మి ఆ యువతి గుంటూరుకు వచ్చింది. అక్కడ మద్యం తాగించి స్నేహితులతో గంజాయి సేవించి తన స్నేహితులైన రిక్కీ, మణికంఠలతో కలిసి అత్యాచారం చేశారు. వీరంతా బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. 
 
బుధవారం రాత్రి పక్కా ప్లాన్‌తో గుంటూరు నగర శివారు ప్రాంతం ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న ఓ హోటల్‌ గదిని అద్దెకు తీసుకుని పీకల వరకు మద్యం సేవించారు. వీరిలో ఒకడు మద్యం మత్తులో ఆ బాలికకు ఫోన్ చేసి గ్రేస్ బాబు మద్యం తాగి హోటల్‌లో పడిపోయాడని, నీవొస్తేగానీ అన్నం తినడని మొండికేస్తున్నాడంటూ నమ్మించారు. 
 
ఆ తర్వాత మరో యువకుడు ఆ బాలిక ఇంటికి వెళ్లి బలవంతంగా బైకు ఎక్కించుకుని హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాలికకు కూడా మద్యం తాగించారు. ఆమె మత్తులోకి జారుకోగానే వారంతా కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ పాలిక అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో భయపడిన ఆ యువకులు బైకుపై తీసుకొచ్చి ఇంటి సమీపంలో పడేసి వెళ్లిపోయారు. 
 
తమ కుమార్తెను చూసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తూ నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు యువతిని వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత హోటల్‌కు వెళ్లి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
 
పైగా, ఈ కేసులో ప్రధాన నిందితుడుగా భావించే గ్రేస్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. గ్రేస్ బాబు ఎలాంటి నేరానికి పాల్పడలేదని నల్లపాడు సీఐ శ్రీనివాసరావు వకాల్తా పుచ్చుకోవడం గమనార్హం. అంతేకాకుండా ఈ దారుణం బుధవారం రాత్రి జరిగితే గురువారం సాయంత్రం వరకు కేసు నమోదు చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments