Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈసీజీ తీయాలని వివస్త్రను చేసి అసభ్యంగా ప్రవర్తించిన టెక్నీషియన్!

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (10:01 IST)
అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన ఓ యువతికి చేదు ఘటన ఎదురైంది. ఈసీజీ తీసేందుకు ఆ యువతితో దుస్తులన్నీ విప్పించి... ఆ తర్వాత టెక్నీషియన్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణం గుంటూరు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాత గుంటూరుకు చెందిన 19 ఏళ్ల యువతికి కొద్దిరోజులుగా ఛాతితో బాధపడుతూ వస్తుంది. దీంతో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఆసుపత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఈసీజీ పరీక్షలు చేయించుకు రావాలని చీటీ రాసి ఇచ్చారు. 
 
యువతి ఈసీజీ తీయించుకోవడానికి వెళ్లింది. ఆ విభాగంలో ఉన్న హరీష్ ఆమెతోపాటు వచ్చిన తల్లిదండ్రులను గది బయటకు పంపించాడు. యువతికి ఈసీజీ తీస్తానంటూ వస్త్రాలను తొలగించాలన్నాడు. అందుకు ఆమె అడ్డు చెప్పడంతో అలాగైతే ఈసీజీ సరిగా తీయలేం... ఛాతి లోపల సమస్య ఏమిటో రిపోర్టులో స్పష్టంగా రావాలంటే తప్పనిసరిగా వస్త్రాలు తీయాలంటూ ఒత్తిడి చేశాడు. 
 
ఇంకా చాలా మంది వేచి ఉన్నారు.. త్వరగా తీయించుకుంటావా లేదా అంటూ హడావిడి చేసి ఆమె చేత బలవంతంగా వస్త్రాలన్నింటినీ తొలగించి వేయించాడు. కళ్లు మూసుకొని అక్కడ ఉన్న బల్లపై పడుకోవాలని చెప్పి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వాటిని తన చరవాణిలో చిత్రీకరిస్తుండగా ఖంగుతిన్న ఆమె అతన్ని ప్రతిఘటిస్తూ బల్లపై నుంచి పైకి లేచింది. 
 
లోపలకు వెళ్లిన తన కుమార్తె ఎంతసేపైనా ఇంకా బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు హైరానా పడుతున్నారు. ఇంతలో లోపల నుంచి ఆ యువతి ఏడ్చుకుంటూ బయటకు వచ్చి జరిగిన విషయాన్ని తన తండ్రికి తెలిపింది. కోపోద్రిక్తుడైన తండ్రి అతన్ని నిలదీయగా తాను అలా ప్రవర్తించలేదంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత జీజీ హెచ్‌లోని అవుట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments