ఆస్తి కోసం మనువడిని చంపేసిన తాత.. ఎక్కడ?

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (14:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం మనువడిని సొంత తాత చంపేశాడు. ఆరేళ్ల వయస్సున్న మనువడిని కర్కశంగా కాల్వలో తొక్కి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. ఈ దారుణం జిల్లాలోని పెంటపాడు మండలం, మీనవల్లూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గ్రామానికి చెందిన పోకల సత్యనారాయణకు బుట్టాయిగూడెం మండలం రామన్నగూడేనికి చెందిన శిరీషతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తి తేవాలని భర్త సత్యనారాయణ, మామ నాగేశ్వరరావు (60), అత్త లక్ష్మిలు కలిసి శిరీషను వేధించసాగారు. దీనిపై పెద్ద మనుషుల వద్ద పంచాయితీలు నడుస్తున్నాయి. 
 
ఈ క్రమంలో శిరీష కోర్టుకు వెళ్తే తమ ఆస్తి మనువడు కల్యాణ్ వెంకట్ పేరున వెళ్లిపోతుందని మామ నాగేశ్వరరావు భావించాడు. మనుమడిని అడ్డు తొలగించుకుంటే ఆస్తి మొత్తం తన వద్దే ఉంటుందని దురాలోచన చేశాడు. ఈ నెల 9న పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న కల్యాణ్‌ను భార్య, కుమారుడి సహకారంతో నాగేశ్వరరావు తనతో బయటికి తీసువెళ్లి కాల్వలో తొక్కి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. 
 
ఇటు కొడుకు కనిపించకపోవడంతో తల్లి శిరీష పెంటపాడు. పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తాతే హత్య చేశాడని గుర్తించారు. ఇందుకు సహకరించిన అతడి భార్య, కుమారుడు సహా ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments