Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకల దొంగలను ఎస్ఎస్ఐ పట్టుకుంటే కత్తులతో నరికి చంపేసారు

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (13:14 IST)
అతడో నిజాయితీగల పోలీస్ ఇన్‌స్పెక్టర్. నేరగాళ్ల గుండెల్లో నిద్రపోతాడు. అలాంటి పోలీసు అధికారిని మేకల దొంగలు అత్యంత దారుణంగా హత్య చేసారు.

 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తిరుచ్చిలోని తిరువేంబూరు పరిధిలోని నవల్ పట్టు పోలీసు స్టేషనులో ఎస్ఎస్ఐగా 51 ఏళ్ల భూమినాథన్ పనిచేస్తున్నారు. ఆయన తన గస్తీలో భాగంగా చిన్న సూర్యర్ గ్రామ శివార్లలో అర్థరాత్రి వేళ మేకల అరుపులు విన్నాడు. నలుగురు వ్యక్తులు మేకలను దొంగతనం చేసి మోటార్ సైకిళ్లపై పారిపోవడాన్ని గుర్తించాడు. తనతో పాటు గస్తీలో వున్న మరో పోలీసుతో కలిసి వెంబడించారు.

 
కొంతదూరం వెళ్లాక తనతో వచ్చిన పోలీసు అలసిపోయి వెనుదిరిగాడు. కానీ భూమినాథన్ మాత్రం వారిని అదుపులోకి తీసుకున్నాడు. ఆ తర్వాత పోలీసు స్టేషనుకు ఫోన్ చేసి ఎస్సైకి సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి రావాలన్నాడు. ఐతే ఈలోపుగా వారిలో ఇద్దరు వెనుదిరిగి కత్తులతో భూమినాథన్ పైన దాడి చేసి హతమార్చారు.

 
ఎస్సై వచ్చేలోపు భూమినాథన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన వెలుగుచూడటంతో పోలీసులంతా ఉలిక్కిపడ్డారు. నిందితుల కోసం వేట ప్రారంభించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments