Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్టల్ గదిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించిన విద్యార్థిని.. ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (11:43 IST)
మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. సూర్యాపేటలో ఈ విషాదకర ఘటన జరిగింది. హాస్టల్ గదిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందికి దించిన టీచర్లు ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ విద్యార్థిని చనిపోయిందని వైద్యులు తేల్చారు. ఫేర్‌వెల్ పార్టీ ముగిసిన తర్వాత తన హాస్టల్ గదికి వెళ్లిన విద్యార్థిని ఈ దారుణానికి పాల్పడింది.
 
సూర్యాపేట జిల్లా ఇమాంపేటలోని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ వార్డెన్ వెల్లడించిన వివరాల మేరకు శనివారం ఇంటర్ విద్యార్థులు ఫేర్‌వెల్ పార్టీ జరిగింద. సాయంత్రం ఈ పార్టీలో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థిని వైష్ణవి ఉత్సాహంగా ఉంటూ సహ విద్యార్థులతో కలిసి పాల్గొంది. పార్టీలో స్నాక్స్, కూల్‌డ్రింక్స్ పంచుతుండగా వైష్ణవి మాత్రం తన గదికి వెళ్లిపోయి, ఫ్యానుకు ఉరేసుకుని ఉండటాన్ని ఇతర విద్యార్థులు చూసి తమకు చెప్పారని తెలిపారు.
 
దీంతో వెంటనే వెళ్లి చూడగా వైష్ణవిని కిందికి దించి చూడగా, ఆమె అప్పటికి ప్రాణాలతోనే ఉందని, దీంతో 108కు ఫోన్ చేసి ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. కానీ, అక్కడ వైద్యులు పరీక్షించి మార్గమధ్యంలోనే చనిపేయినట్టు నిర్ధారించారని మీడియాకు వెల్లడించారు. ఇటీవలే యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే ఇపుడు సూర్యాపేటలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments