Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్: విద్యార్థినిని వెంబడించి జుట్టు పట్టుకుని లాగిన పోలీసులు

Advertiesment
scooty

సెల్వి

, గురువారం, 25 జనవరి 2024 (09:48 IST)
scooty
హైదరాబాద్‌లో నిరసన సందర్భంగా విద్యార్థినిని స్కూటర్‌పై వెళ్లిన పోలీసులు జుట్టుపట్టుకుని ఓ యువతిని ఈడ్చుకెళ్లిన వీడియో దుమారం రేపింది. ఈ వీడియోలో స్కూటీపై ఇద్దరు పోలీసులు నిరసనలో పాల్గొన్న యువతిని వెంబడించి.. ఆమె జుట్టు పట్టుకుని లాగడం, ఆ అమ్మాయి కిందపడిపోయి నొప్పితో ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది. 
 
హైదరాబాద్‌లో తెలంగాణ హైకోర్టు భవన నిర్మాణానికి అగ్రికల్చర్ యూనివర్శిటీ స్థలాన్ని కేటాయించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా పోలీసులు స్కూటీపై విద్యార్థినిని వెంబడించి ఆమె జుట్టు పట్టుకుని లాగిన వీడియో వైరల్ అవుతోంది. 
 
స్కూటీపై ఇద్దరు పోలీసులు మహిళా నిరసనకారులను వెంబడించడం, ఆమె జుట్టు పట్టుకుని లాగడం, ఆ అమ్మాయి కిందపడిపోయి నొప్పితో ఏడుస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. 
 
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్శిటీ క్యాంపస్‌లో హైకోర్టు నిర్మాణానికి యూనివర్శిటీ స్థలాన్ని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘం చేపట్టిన నిరసనలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. హమ్మయ్య ఎవరికీ గాయాల్లేవ్