Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో దారుణం: 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్, ప్రైవేట్ భాగంలో పదునైన ఆయుధంతో...

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (13:37 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన తర్వాత బాలిక ప్రైవేట్ భాగంలో పదునైన ఆయుధాలను చొప్పించి తీవ్రంగా గాయపరిచారు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజస్థాన్ లోని ఆళ్వారులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమె ప్రైవేట్ భాగంలో పదునైన ఆయుధాలను చొప్పించి తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత ఆమెను తిజారా కల్వర్ట్ వద్ద రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.

 
అపస్మారక స్థితిలో వున్న బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను సమీప ఆసుపత్రికి తరలించారు. ఐతే అంతర్భాగాలకు తీవ్రంగా గాయాలు కావడంతో రక్తస్రావం అధికమైంది. అందువల్ల ఆమెను జైపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

నా గోవిందా నాకే సొంతం విడాకులపై భార్య స్పందన

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం