Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠాలు చెప్పాల్సిన టీచర్ శృగారం నేర్పుతోంది... విద్యార్థినితో టీచర్ లైంగిక సంబంధం!!

వరుణ్
సోమవారం, 1 జులై 2024 (13:59 IST)
తన వద్దకు వచ్చే విద్యార్థులకు నాలుగు విద్యాబుద్ధులు చెప్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ మహిళా టీచర్ పాడుపనికి పాల్పడింది. పాఠాలు చెప్పాల్సిన ఆమె ఏకంగా శృంగార పాఠాలను నేర్పుతోంది. తన వద్ద చదువుకునే ఓ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమెపై కేసు నమోదు చేశారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానికంగా ఉండే ఫ్రీహోల్డ్‌ ఇంటర్మీడియట్‌ పాఠశాలలో 43 ఏళ్ల ఎలీసన్‌ హవెమాన్‌ అనే మహిళ టీచర్‌గా పనిచేస్తోంది. ఈ ఏడాది మొదటి నుంచి ఆమె విద్యార్థులను లైంగికంగా వేధించడం మొదలుపెట్టింది. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆమె మాన్‌హట్టన్‌ కౌంటీ జైలులో ఉంటోంది. 
 
అక్కడి పోలీసులు బాధితుడైన మైనర్‌ పేరు, ఇతర వివరాలు వెల్లడించలేదు. ఆమె బాధితులు ఇంకెవరైనా ఉన్నారేమోనని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ పాఠశాల నుంచి ఆమెను తొలగించారు. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు వెల్లడించారు. ఇక ఎలీసన్‌ లాయర్‌ మాత్రం తన క్లయింట్‌ నిర్దోషి అని చెబుతున్నాడు. 
 
లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లో మాత్రం ఎలీసన్‌ తనను తాను ఎంతో మంచి టీచర్‌గా పేర్కొంది. ఫలితాల కోసం పనిచేసే సిన్సియర్‌ ఎడ్యుకేటర్‌నని వెల్లడించింది. ఆమె 2022 నుంచి ఫ్రీహోల్డ్‌ స్కూల్లో పనిచేస్తోంది. అంతకు ముందు పలు పాఠశాలల్లోను విధులు నిర్వహించినట్లు  తెలుస్తోంది. ఆమె వద్ద 6 నుంచి 8వ గ్రేడ్‌ విద్యార్థులు చదువుకొంటారు. వీరి వయస్సు 14ఏళ్ల లోపే ఉండొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం