Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానంతో పసిబిడ్డకు విషమిచ్చిన చంపేసిన కన్నతండ్రి

ఠాగూర్
శుక్రవారం, 5 జనవరి 2024 (13:06 IST)
తెలంగాణ రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. భార్యపై అనుమానంతో కన్నబిడ్డకు విషమిచ్చి చంపేశాడో కసాయి తండ్రి. ఈ దారుణం జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఐజ పట్టమానికి చెందిన భార్గవ్ అనే వ్యక్తికి గత 2019తో వనపర్తి జిల్లా వీపనగుండ్ల మండలం, పెంట్లవెల్లికి చెందిన పల్లవి అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లయిన గత యేడాది వరకు వీరి సంసార జీవితం సాఫీగానే సాగిపోయింది. ఈ క్రమంలో కుమారుడు, కుమార్తె జన్మించాడు. 
 
అయితే, పెళ్లయిన యేడాది నుంచే భార్యను భార్గవ్ వేధించసాగాడు. అనుమానంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చేశాడు. చివరకు ఫోనులో కూడా మాట్లాడకుండా చేశారు. ఈ క్రమంలో భర్త వేధింపులు తాళలేని ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. అనుమానంతో ఇంట్లో గొలుసులతో కట్టేశాడని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం భార్యాభర్తల మధ్య గొడలు రావడంతో తన పిల్లలతో కలిసి పుట్టింటింకి వచ్చింది. దీంతో భార్యపై భర్తకు మరింత కోపం పెరిగింది. 
 
ఈ క్రమంలో గత నెల 29వ తేదీన ఎలుకలు మందు, నిద్రమాత్రలు కలిపి తన కుమారుడు నంద కిషోర్‌కు తాపించాడు. దీన్ని గమనించిన ఇరుగుపొరుగువారు సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణగండం నుంచి బయటపడ్డాడు. అప్పటికీ కసి తీరకపోవడంతో ఈ నెల 3వ తేదీన మరోమారు ఎలుకలు మందు, నిద్రమాత్రలు కలిపి చిన్నారికి తాగించి తాను కూడా తాగాడు. అయితే, కుమారుడు నంద కిషోర్ ప్రాణాలు కోల్పోగా, భార్గవ్ మాత్రం  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments