Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబడ్డీ శిక్షణ తీసుకునే ఇద్దరు మైనర్లపై తండ్రీకుమారుల అత్యాచారం

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (14:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. విశాఖపట్టణం జిల్లాలోని అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మైనర్లపై తండ్రీ తనయులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఇద్దరు మైనర్ బాలికలు క‌బ‌డ్డీ శిక్ష‌ణ‌కు తీసుకుంటూ వస్తున్నారు. ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లాలోని అచ్యుతాపురం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన బాప‌య్య (50), ఆయ‌న కుమారుడు నూక‌లు (27) క‌లిసి క‌బ‌డ్డీ శిక్ష‌ణా కేంద్రం నిర్వ‌హిస్తున్నారు. దీంతో క‌బడ్డీ శిక్ష‌ణ కోసం పిల్ల‌లు వ‌స్తున్నారు. ఇందులో ఓ ఇద్ద‌రు అమ్మాయిల‌పై బాప‌య్య‌, నూక‌లు క‌న్నేశారు. 
 
వారిని ఒంట‌రిగా నిర్బంధించి అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బాధిత చిన్నారులు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బాధిత అమ్మాయిలు త‌మ త‌ల్లిదండ్రుల స‌హ‌కారంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాప‌య్య‌, నూక‌లు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments