Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై భర్త కత్తితో దాడి... అడ్డుకున్న స్థానికులు (Video)

ఠాగూర్
బుధవారం, 12 మార్చి 2025 (08:31 IST)
ఏపీలోని నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం గంటాతోపు అనే గ్రామంలో దారుణం జరిగింది. భార్యపై భర్త కత్తితో దాడి చేశారు. ఈ దాడిని గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. రైల్వే కోడూరు చెందిన లక్ష్మిప్రియని శ్రీకాళహస్తికి చెందిన హేమంత్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం సాఫీగానే సాగిన వీరి సంసారంలో వరకట్న వేధింపులు మొదలయ్యాయి. 
 
పుట్టింటి నుంచి కట్నకానుకలు తీసుకునిరావాలంటూ భర్త హేమంత్ కొంతకాలంగా వేధించసాగాడు. ఈ క్రమంలో భార్య లక్ష్మిప్రియపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో గాయపడిన ప్రియను స్థానిక యువకులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
నిరీక్షణ ముగిసింది.. న్యాయం జరిగింది : ప్రణయ్ భార్య అమృత 
 
తన భర్త హత్య కేసులో తన నిరీక్షణ ముగిసిందని, దీంతో తనకు న్యాయం జరిగిందని ప్రణయ్ భార్య అమృత అన్నారు. గత 2018లో ప్రణయ్ అనే దళిత యువకుడు ఉన్నత కులానికి చెందిన అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని అమృత తండ్రి మారుతిరావు బీహార్‌కు చెందిన కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఆ తర్వాత ఆయన కొంతకాలానికి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఈ కేసులో ఏ2గా ఉన్న బీహార్‌కు చెందిన కిరాయి హంతకుడు సుభాష్ శర్మకు నల్గొండ ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేయగా, మిగిలిన నిందితులకు యావజ్జీవ కారాగారశిక్షను విధిస్తూ సోమవారం తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై ప్రణయ్ భార్య అమృత స్పందించారు. 
 
తన భర్త ప్రణయ్ హత్య కేసులో న్యాయం జరిగిందని పేర్కొన్నారు. పరువు పేరిట చేసే దురాగతాలు ఈ తీర్పుతో అయినా తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. తన నిరీక్షణ ముగిసింది. న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన హృదయం భావోద్వేగంతో నిండిపోయిందన్నారు. తనకు అండగా నిలిచిన పోలీసు శాఖ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియా సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. 
 
తన బిడ్డ పెద్దవాడవుతున్నాడని, తన మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అలాగే, అతని భవిష్యత్‌ను కాపాడుకోవడానికి తాను మీడియా ముందు కనిపించడం లేదని అన్నారు. తాను ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించలేనని పేర్కొన్నారు. అందువల్ల శ్రేయోభిలాషులందరూ తమ గోప్యతను అర్థం చేసుకుని గౌరవించాలని అభ్యర్థిస్తున్నట్టు ఆమె రాసుకొచ్చారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments