Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా నేను చనిపోతున్నా.. ఇదే నా చివరి కాల్.. ఇక నేను కలవను...

Webdunia
సోమవారం, 29 మే 2023 (09:37 IST)
అన్నా.. నేను చనిపోతున్నా.. ఇదే నా చివరి కాల్‌.. ఇక నేను కలవను.. క్షమించండంటూ ఓ యువకుడు తన సోదరుడికి ఫోన్‌ చేసి రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడటం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు.. కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌కు చెందిన కేదరిశెట్టి శివసాయి గణేశ్‌ (22) తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి నుంచి కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌కు సుమారు కరోనా మొదటి లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబంతో వచ్చాడు.
 
స్థానికంగా మిర్చిబజ్జీ బండి నడిపిస్తున్నాడు. ఇతని సోదరుడు మణికంఠ కూడా మాదాపూర్‌లో అదే వ్యాపారం చేస్తున్నాడు. అంతా కలిసే ఉంటారు. శనివారం మణికంఠ పుట్టినరోజు కావడంతో స్నేహితులతో బయట ఉన్న సమయంలో రాత్రి 10.24 గంటలకు శివసాయి గణేశ్‌ ఫోన్‌ చేసి చనిపోతున్నా.. అని చెప్పగా ఏం జరిగిందని మణికంఠ అంటుండగానే ఫోన్‌ ఆపేశాడు.
 
వెంటనే ఇంటికి చేరుకున్న మణికంఠ విషయం చెప్పి సమీపంలోని హైటెక్‌ సిటీ ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌ చుట్టుపక్కల వాకబు చేసే క్రమంలో శివసాయిగణేశ్‌ రైలు కింద పడి మృతిచెందివుండటాన్ని గుర్తించాడు. తన పుట్టినరోజునే సోదరుడు విగతజీవిగా మారడం చూసి బోరుమన్నాడు. 
 
ఆర్థిక సమస్యలు తమతో పంచుకోకుండా ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు విలపించారు. శవపరీక్ష అనంతరం రైల్వే పోలీసులు మృతదేహాన్ని అప్పగించడంతో ఆదివారం అంత్యక్రియలు పూర్తిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments