Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరిదితో అఫైర్.. భర్త చీవాట్లు పెట్టడంతో రైలు పట్టాలపై శవాలై తేలారు...

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (19:06 IST)
పచ్చని సంసారంలో వివాహేతర సంబంధాలు నిప్పుల కుంపటిని రాజేస్తున్నాయి. కామం మత్తులోపడిన కొందరు వావివరుసలు మరిచిపోయి, క్షణకాలపు శారీరక సుఖం కోసం అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి సంబంధాలు చివరకు విషాదాంతంగా ముగుస్తున్నాయి. తాజాగా ఓ వివాహిత వరుసకు మరిది అయ్యే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిచి భార్యను చీవాట్లు పెట్టారు. అంతే మరిదితో కలిసి లేచిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ శవాలై తేలారు. ఈ దారుణం వెస్ట్ గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాలోని ఏలూరు కొత్తపేటకు చెందిన ఓ మహిళకు ఓ వ్యక్తితో కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలా సాఫీగా సాగిపోతున్న వారి పచ్చటి సంసారంలో ఫేస్‌బుక్ చిచ్చుపెట్టింది. వరుసకు మరిది అయ్యే ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, అక్రమ సంబంధానికి దారితీసింది. భర్త లేనపుడు తన ప్రియుడుని ఇంటికి పిలిచి రాసలీలల్లో మునిగిపోసాగింది. 
 
ఈ విషయం భర్తకు తెలిసి భార్యను మందలించింది. ఈ విషయాన్ని తన ప్రియుడికి చేరవేసింది. ఆ తర్వాత వారిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. తమ బండారం బయటపడటంతో తమ సంబంధం ఇకపై కొనసాగదని భావించి వారిద్దరూ ఏలూరు పవర్ పేట రైల్వే స్టేషన్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు తమ మృతికి ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ లేఖలు లభ్యమయ్యాయి. ఈ ఆత్మహత్యలపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ మహిళ మరణంతో ఆమె ఇద్దరు పిల్లలు ఇపుడు తల్లిలేని బిడ్డలుగా మారారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments