Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఠాగూర్
శుక్రవారం, 18 జులై 2025 (09:28 IST)
ఏపీలోని కోనసీమ జిల్లాలో ఓ దారుణం జరిగింది. తన కోరిక మేరకు వ్యభిచారం చేయలేదన్న అక్కసుతో ఓ వివాహితను ఆమె ప్రియుడు కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసుల కథనం మేరకు ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
వెస్ట్ గోదావరి జిల్లా జిల్లా యలమంచిలి మండలం ఏనుగువాని లంకకు చెందిన పుష్ప(26)కు ఐదేళ్ళ క్రితం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. కొంతకాలానికి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెద్దల సమక్షంలో విడిపోయారు. ఈమెకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. తల్లి అంగాని గంగ, కుమారుడు, సోదరుడితో కలిసి రాజోలు మండలం బి.సావరంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పుష్ప రెండేళ్ల నుంచి రాజోలుకు చెందిన ఏసీ మెకానిక్ షేక్‌తో పుష్ప సహజీవనం చేస్తోంది. వీరిమధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. 
 
బుధవారం అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చిన షేక్ కత్తితో పుష్ప ఛాతీపై బలంగా పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అడ్డు వచ్చిన తల్లి గంగ, సోదరుడు వినోద్‌ను దాడిచేసి గాయపరిచాడు. మద్యానికి బానిసై డబ్బు కోసం తన కుమార్తెను వ్యభిచారం చేయాలని శారీరకంగా హింసిస్తున్నాడని మృతురాలి తల్లి విలపిస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments