కుక్క మొరిగిందని కుక్కతోపాటు దాని యజమానులను చావగొట్టాడు: video వైరల్

Webdunia
సోమవారం, 4 జులై 2022 (17:06 IST)
బజారులో వెళుతుంటే కొన్నిచోట్ల కుక్కలు మీదపడేట్లు అరుస్తుంటాయి. ఇలాంటివి కొందరు పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు. కానీ కొందరు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కుక్కలను అదుపులో పెట్టకుండా జనం మీదకి వదులుతారేంటి అని పొట్లాడుతారు కూడా. కొన్నిసార్లు ఇదికాస్తా ఘర్షణ, దాడికి దారితీస్తుంది. అలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. సీసీటీవీ కెమేరాలో రికార్డయిన ఈ భయానక దృశ్యం వివరాలు ఇలా వున్నాయి.

 
ఢిల్లీలో ఓ వ్యక్తి పెంపుడు కుక్క ఎడతెగకుండా మొరిగినందుకు అతని పొరుగువారిపై, వారి కుక్కపై క్రూరంగా దాడి చేశాడు. ఆ వ్యక్తి పట్టపగలు బాధితులపై ఇనుప రాడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణమంతా సీసీటీవీలో రికార్డవ్వగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దాడికి పాల్పడ్డ నిందితుడిని ధరమ్‌వీర్ దహియాగా గుర్తించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఢిల్లీలోని పశ్చిమ్ విహార్‌లో ఆదివారం ఉదయం జరిగింది.

 
నిందితుడు దహియా వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా ఓ పెంపుడు కుక్క అతడిని వెంబడిస్తూ ఎడతెగకుండా మొరగడం ప్రారంభించింది. దాంతో ఆగ్రహానికి గురైన దహియా కుక్కను తోక పట్టుకుని గిరగిరా తిప్పి దూరంగా విసిరేశాడు. దాంతో పెంపుడు కుక్క యజమాని జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించడంతో చిన్నపాటి గొడవ జరిగి కుక్క నిందితుడిని కరిచింది.


<

Day light violence in Delhi paschim vihar A4 block.
This man attacked multiple people including a woman and a dog @narendramodi @DelhiPolice @CPDelhi @PMOIndia @ArvindKejriwal @AamAadmiParty @BJP4India @peta #AnimalAbuse #Attack #attempttomurder @ndtvvideos @ndtvindia pic.twitter.com/tsusXkZCDA

— Mohit Mohlia (@MohitMohlia) July 3, 2022 >కుక్క కరవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు ఇనుప రాడ్డుతో తిరిగి వచ్చి కుక్క తలపై కొట్టడంతో అది అక్కడికక్కడే కుప్పకూలింది. అడ్డు వచ్చిన ముగ్గురు వ్యక్తులను రక్తమోడేట్లు కొట్టాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments