వెలిగండ్లలో వివాహిత దారుణ హత్య... గుండెలపై నుంచి కారు ఎక్కించి చంపేశారు..

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (10:59 IST)
ఏపీలోని ప్రకాశం జిల్లా వెలిగండ్లలో దారుణం జరిగింది. మండల పరిధిలోని జిల్లెళ్లపాడు శివారులో గురువారం రాత్రి ఈ దారుణ హత్య జరిగింది. ఈమెను అత్యంత దారుణంగా హత్య చేశారు. తొలుత కాళ్లపై కారు పోనిచ్చారు. ఆ తర్వాత ఆమె గుండెలపై కారు ఎక్కించి చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన ఓ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి తన కుమార్తె కోట రాధ (35) కనిపించడం లేదనంటూ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాం జిల్లెళ్లపాడు సమీపంలో రోడ్డు పక్కన కనిపించింది. నిందితులు తొలుత రాధ కాళ్ళపై నుంచి కారును పోనిచ్చారు. దీంతో కదల్లేని స్థితికి చేరిన తర్వాత ఆమె గుండెలపై నుంచి కారు నడిపారు. 
 
ఆ తర్వాత కూడా ఎక్కడ బతుకుతుందోనన్న అనుమానంతో ముఖంపై బండరాయితో మోది అత్యంత క్రూరంగా హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అంతకుముందు ఆమెను కొంతదూరం ఈడ్చుకెళ్లినట్టుగా తెలిపేలా ఆమె శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి. ఈ హత్యలో నలుగురు లేదా ఐదుగురు పాల్గొనివుంటారని భావిస్తున్నారు. 
 
దీనిపై మృతురాలి తండ్రి స్పందిస్తూ, మండలంలోని గుండ్లోపల్లికి చెందిన కేతిరెడ్డి కాశిరెడ్డికి తన కుమార్తె, అల్లుడు కలిసి రూ.50 లక్షలు అప్పు ఇచ్చారని, అవి తిరిగి చెల్లించడం ఇష్టంలేకే కాశిరెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడివుంటారని సుధాకర్ రెడ్డి, తల్లి సుబ్బలక్ష్మిలు ఆరోపిస్తున్నారు. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లిస్తామని పిలిపించి ఈ దారుణానికి ఒడిగట్టివుంటారని వారు ఆరోపిస్తున్నారు. 
 
కాగా, తెలంగాణకు చెందిన మోహన్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్‌ను వివాహం చేసుకున్న రాధకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరంతా కలిసి సూర్యాపేటలో ఉంటున్నారు. ప్రకాశం జిల్లాలోని తన స్వగ్రామంలో చౌడేశ్వరిదేవి కొలుపులు ఉండటంతో ఈ నెల 11వ తేదీన పుట్టింటికి వచ్చిన రాధ.. ఈ దారుణ హత్యకు గురికావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments