Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధి కోసం నగరానికి వచ్చిన బంగ్లా యువతి.. వ్యభిచార వృత్తిలోకి దింపిన దంపతులు...

ఠాగూర్
ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (11:29 IST)
ఏదో ఒక ఉపాధి చేసుకుని డబ్బు సంపాదించుకోవాలని హైదరాబాద్ నగరానికి వచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతి... దంపతులు వ్యభిచార వృత్తిలోకి దించారు. ఈ వృత్తికి అలవాటుపడిన ఆ యువతి శుక్రవారం దంపతులకు చెప్పాపెట్టకుండా అత్తాపూర్‌లోని ఓ కస్టమర్‌ వద్దకు వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న దంపతులు.. ఆ యువతిని వెంబడించి పట్టుకున్నారు. దీంతో గొడవ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు రావడంతో అసలు విషయం బహిర్గతమైంది. 
 
పాతబస్తీ చాంద్రాయణగుట్ట ఘాజిమిల్లత్‌ కాలనీలో షేక్‌ సోనియా(27), మహ్మద్‌ సల్మాన్‌(24) దంపతులు నివసిస్తున్నారు. వస్త్ర దుకాణంలో పనిచేసే మహ్మద్‌ సల్మాన్‌.. షేక్‌ సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ, భారత్‌కు చెందిన వ్యక్తికి పుట్టిన సంతానం. దీంతో కోల్‌కతా నగరంతో షేక్‌ సోనియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశస్థులు పరస్పరం మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా ఒక యాప్‌ ఉంది. 
 
ఈ యాప్‌లో షేక్‌ సోనియా చాటింగ్‌ చేస్తుండగా బంగ్లాదేశ్‌ వొర్సిండి మండలం రాయ్‌పూర్‌ గ్రామానికి చెందిన స్రిస్టీ అక్తర్‌(22) పరిచయమైంది. వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో హైదరాబాద్‌లో తనకు డబ్బు సంపాదించేందుకు ఉద్యోగం దొరుకుతుందా అని స్రిస్టీ అక్తర్‌ అడిగింది. ఇళ్లలో పనిచేసే ఉద్యోగమైతే నెలకు రూ.10 వేలు వస్తాయని, వ్యభిచార వృత్తిలోకి వస్తే నెలకు రూ.20 వేలు వస్తాయని షేక్‌ సోనియా చెప్పింది. డబ్బు కోసం తాను ఏపనైనా చేస్తానని స్రిస్టీ అక్తర్‌ వెల్లడించింది. 
 
దీంతో భారత్‌లోకి ఎలా ప్రవేశించాలని అడగ్గా.. ఆ రిస్కు నీవే తీసుకోవాలి.. ఒక వేళ ఇక్కడికి వస్తే తనకు ఫోన్‌ చేయాలని చరవాణి నంబరు ఇచ్చింది. రెండు నెలల క్రితం స్రిస్టీ అక్తర్‌ బంగ్లాదేశ్‌ సరిహద్దులు దాటి అక్రమ మార్గంలో కోల్‌కతాకు చేరింది. అక్కడి నుంచి రైలులో నేరుగా సికింద్రాబాద్‌కు వచ్చి షేక్‌ సోనియాకు ఫోన్‌ చేసింది. దంపతులు వెళ్లి యువతిని చాంద్రాయణగుట్టలోని తమ ఇంటికి తీసుకొచ్చారు. ఆమెతో వ్యభిచారం చేయించడం మొదలు పెట్టారు. 
 
స్వయంగా షేక్‌ సోనియా వెంటవెళ్లి స్రిస్టీ అక్తర్‌ను తిరిగి తీసుకొచ్చేది. సోనియా చరవాణి ఆ సమయంలో స్రిస్టీ అక్తర్‌ వద్ద ఉండేది. శుక్రవారం షేక్‌ సోనియా పక్కింట్లోకి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఆమె చరవాణికి కాల్‌ రాగా స్రిస్టీ అక్తర్‌ మాట్లాడింది. అత్తాపూర్‌లోని పిల్లర్‌ నంబరు 150 వద్దకు రావాలని సదరు వ్యక్తి చెప్పడంతో ఆమె ఆటో ఎక్కి అక్కడికి వెళ్లింది. ఇంటికి వచ్చిన షేక్‌ సోనియా తన చరవాణి అక్కడే పడి ఉండడం, స్రిస్టీ అక్తర్‌ కనిపించకపోవడంతో అనుమానపడింది. 
 
ఆఖరులో వచ్చిన నంబరుకు కాల్‌చేయగా అత్తాపూర్‌కు వస్తోందని తెలిసింది. వెంటనే దంపతులు వెంబడించగా అత్తాపూర్‌లో స్రిస్టీ అక్తర్‌ కనిపించింది. తమకు చెప్పకుండా ఎందుకు వచ్చావని అడగడంతో వారి మధ్య గొడవ జరిగింది. సోనియా చేతిలోని చరవాణి లాక్కొని యువతి డయల్‌ 100 చేయగా అత్తాపూర్‌ ఏఎస్ఐ మహ్మద్‌ బుర్హానుద్దీన్‌, మహిళా సిబ్బందితో అక్కడికి వచ్చారు. 
 
అసలు విషయం తెలుసుకొని చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు దంపతులతో పాటు యువతిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్రిస్టీ అక్తర్‌కు బంగ్లాదేశ్‌లో భర్త ఆసిఫ్‌ఖాన్‌, ఇద్దరు సంతానం ఉన్నట్లు వెల్లడైంది. ఆసిఫ్‌ఖాన్‌ మేస్త్రీ పనిచేయడంతో డబ్బు సరిపోక ఆమె అక్రమ మార్గంలో దేశ సరిహద్దులు దాటి వ్యభిచార వృత్తిలోకి చేరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments