Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కెస్ట్రా ట్రూప్‌లోని ఓ యువతిపై సామూహిక అత్యాచారం...

ఠాగూర్
మంగళవారం, 5 మార్చి 2024 (15:21 IST)
జార్కండ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఇటీవల స్పానిష్ మహిళపై ఏడుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఇంకా మరిచిపోకముందే.. తాజాగా మరో దారుణం జరిగింది. ఆర్కెస్ట్రా బృందంలో పాటలు పాడే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి తనపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి వేడుకలో ప్రదర్శన ఇవ్వాలంటూ పాలాము జిల్లాకు పిలిచి ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించింది.
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువతి ఆర్కెస్ట్రా బృందంలో పాటలు పాడుతుంది. ట్రూప్‌తో కలిసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా వెళుతుంది. ఈ క్రమంలోనే ఝార్ఖండ్‌కు చెందిన ఆర్కెస్ట్రా బృందం నిర్వాహకుడు గోలు అనే వ్యక్తి ఓ కార్యక్రమం కోసం బాధితురాలిని పిలిచాడు. పెళ్లిలో ప్రోగ్రాం ఉందని, తన ట్రూప్‌కు ఓ లేడీ సింగర్ కావాలని కోరడంతో బాధితురాలు తన సోదరితో కలిసి పాలాము జిల్లాకు వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక ప్రోగ్రాం రద్దు కావడంతో బాధితురాలితో పాటు ఆమె సోదరికి గోలు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు.
 
చెరో గదిలో వసతి ఏర్పాటు చేసి కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆ కూల్ డ్రింక్ తాగాక తనను మత్తు ఆవరించిందని, అయితే తను మెలకువలోనే ఉన్నానని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆపై గోలు‌తో పాటు ముగ్గురు యువకులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ రోజు రాత్రి పదే పదే రేప్ చేశారని పేర్కొంది. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం