Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

చనిపోయిన స్నేహితురాలి మృతదేహంతో మూడు రోజులు ఇంట్లోనే గడిపిన యువతి

Advertiesment
deadbody

ఠాగూర్

, మంగళవారం, 5 మార్చి 2024 (10:35 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలో ఆశ్చర్యకర ఘటన ఒకటి వెలుగు చూసింది. చనిపోయిన స్నేహితురాలి మృతదేహంతో ఓ యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఏకంగా మూడు రోజుల గడిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఫరా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహువా అనే గ్రామానికి చెందిన హేమకు ఛద్గావ్‌కు చెందిన 26 యేళ్ళ గంగాదేవి అనే స్నేహితురాలు ఉంది. వీరిలో గంగాదేవికి వివాహం కాగా, భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి హేమ కుటుంబం వద్దకు వచ్చి ఉంటుంది. ఈ క్రమలో గత నెల 29వ తేదీన గంగాదేవి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది తెలుసుకున్న హేమ, ఆమె కుటుంబ సభ్యులు విషయాన్ని బయటకు పొక్కనీయకుండా గదిలోనే ఓ మంచంపై మృతదేహాన్ని ఉంచి లోపలి నుంచి గడియపెట్టుకున్నారు. అలా ఆ శవంతోనే వారంతా మూడు రోజుల పాటు గదిలోనే ఉండిపోయారు. 
 
అయితే, రోజులు గడిచే కొద్ది మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో హేమ కొన్ని రకాల అత్తర్లు పిచికారి చేసింది. అయితే, శవం ఉబ్బి కుళ్ళిపోయేకొద్దీ దుర్వాస ఎక్కువకాడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. ఈ దుర్వాసనను పసిగట్టిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. హేమ ఉంటున్న గది తలుపులు బద్ధలు కొట్టి చూడగా, మంచంపై మృతదేహం ఉండటాన్ని గుర్తించి షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, గంగాదేవి చనిపోయి విషయాన్ని బయటకు చెప్పకుండా మూడు రోజుల పాటు హేమ, ఆమె కుటుంబ ఎందుకు అలానే ఉండిపోయిందన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై హేమ స్పందిస్తూ, గంగాదేవి తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడంతో భయపడిపోయి, ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో ప్రధాని మోడీ రెండో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే...