Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉచిత ప్రయాణం-బస్సుల సంఖ్య పెంచరా? కన్నీళ్లు పెట్టుకున్న యువతి!?

Students
, సోమవారం, 18 డిశెంబరు 2023 (22:21 IST)
Students
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం స్కీమ్ రాష్ట్ర జీడీపీని పెంచడమే కాకుండా రాష్ట్రంలో ప్రశాంతమైన, సురక్షితమైన, సమర్థవంతమైన ఆర్టీసీ ప్రయాణాన్ని ఎలా అందించగలుగుతున్నాయో, దానికి ప్రజలనుండి వస్తున్న అద్భుతం ఇదంటూ.. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. అధికారం కోసం పనికిరాని హామీలు ఇచ్చి నిరుపేద విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
ఉచిత ప్రయాణం కోసం మహిళల సంఖ్య పెరగడంతో బస్సులు నిండిపోతున్నాయి. దీంతో విద్యార్థులు కాలేజీలకు వెళ్లడానికి బస్సు టాప్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేగాకుండా బస్సు వెనక గల మెట్లపై విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. దీన్ని చూసి నెటిజన్లు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనేమోనని సెటైర్లు వేస్తున్నారు. 
 
అలాగే జగిత్యాల జిల్లా కేంద్రంలో బస్సుల కోసం మహిళలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. బస్సులు లేక అవస్థలు మహిళలు, కళాశాల విద్యార్థినిలు అవస్థలు పడుతున్నారు. ఒక్కో బస్సులో 100 మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు.  
webdunia
Jagtial Bus full
 
సమయానికి బస్సులు లేక ప్రమాదకర స్థితిలో విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. బస్సులు లేవని కళాశాల విద్యార్థిని రోధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే విద్యార్థులు ప్రమాదకరమైన స్థితిలో ప్రయాణిస్తున్నారు. 
 
దీంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఎంత కష్టమొచ్చిందోనని... స్కీమ్ ప్రవేశపెట్టే ముందు బస్సుల సంఖ్య కూడా పెంచాలి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బస్ కోసం ఎదురుచూస్తున్న మహిళను బైక్ పైన ఎక్కించుకెళ్లి గ్యాంగ్ రేప్