Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను తన వద్దకు రమ్మన్న భర్త.. కత్తితో పొడిచిన ప్రియుడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (19:28 IST)
చెన్నైలో ఓ దారుణం జరిగింది. ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను పెద్ద మనస్సుతో కట్టుకున్న భర్త క్షమించాడు. పైగా, భార్యను తన వద్దకు రావాలని ఫోను చేశాడు. ఈ మాటలు ఆమె ప్రియుడికి ఏమాత్రం రుచించలేదు. ఆమెతో వివాహేతర సంబంధాన్ని వదులుకోరాదని భావించిన ప్రియుడు ఆమె భర్తను హత్య చేశాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 33 యేళ్ళ శంకర్ అనే వ్యక్తి పెయింటింగ్ పనులు చేస్తూ చెన్నైలో ఉంటున్నాడు. ఈయనకు తిరునెల్వేలికి చెందిన ఓ మహిళతో వివాహమైంది. పుట్టింటిలోనే ఉంటున్న ఆ మహిళకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసింది., ఈ నేపథ్యంలో తాను పని చేసే చెన్నైలోనే కలిసివుందామని, అక్కడకు రావాలని ఆమెను ఫోనులో కోరాడు. 
 
ఈ విషయం తెలిసిన ప్రియుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తన ప్రియురాలు చెన్నైకు వెళితే అక్రమ సంబంధం తెగిపోతుందని భావించి, శంకర్‌ను కలిసేందుకు చెన్నైకు వచ్చాడు. పెయింటింగ్ పనులు చేసే స్థలానికెళ్లి శంకర్‌తో గొడవపడ్డాడు. ఆ తర్వాత తన వద్ద ఉన్న కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments