Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి .. బిల్లు చెల్లించలేదని మృతదేహం ఇవ్వని ఆస్పత్రి యాజమాన్యం!!

ఠాగూర్
గురువారం, 30 మే 2024 (10:00 IST)
అనారోగ్యం కారణంగా కొన్నాళ్లుగా బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కన్నుమూసింది. అయితే, ఆస్పత్రి బిల్లులు చెల్లించకపోవడంతో మృతదేహాన్ని అప్పగించేందుకు ఆస్పత్రి యాజమాన్యం నిరాకరించింది. ఈ దారుణ ఘటన చెన్నైలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అనంతపురం జిల్లా గుత్తికి చెందిన నగదాని మాధురి (27) ఐటీ ఉద్యోగిని. కొన్నాళ్లుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం ఏప్రిల్‌లో చెన్నై తీసుకొచ్చారు. సమీప బంధువు ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారు. క్షయ ఉన్నట్లు గుర్తించి కొద్దిరోజులు చికిత్స తర్వాత డిశ్చార్జి చేశారు. ఇంటికెళ్లిన ఆమె మే 6న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పోరూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
 
మూత్రపిండాలు, కాలేయంలో ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా ఉందని, క్షయ కూడా బాగా ముదిరిందని వైద్యులు గుర్తించారు. ఐసీయూలో చికిత్స అందించారు. సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని ఆస్పత్రి సిబ్బంది వెల్లడించడంతో ఆర్థికసాయం కోసం దాతలను అభ్యర్థించారు. రూ.60వేలు వరకు అందింది. ఆరోగ్య బీమా ద్వారా రూ.5 లక్షలు, బంధుమిత్రుల సాయంతో మరో రూ.6 లక్షలతో పాటు మరికొంత చెల్లించారు. 
 
వైద్యానికి మాధురి ఆరోగ్యం సహకరించని నేపథ్యంలో బుధవారం ఉదయం మృతి చెందింది. సుమారు రూ.7.50 లక్షలు వరకు బిల్లులు చెల్లించాల్సి ఉండటంతో మృతదేహాన్ని అప్పగించలేదని మాధురి తండ్రి నగదాని రాజశేఖర్‌ బోరున విలపిస్తూ తెలిపారు. మృతదేహం తీసుకెళ్లడానికి దాతలు సాయం అందించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments