Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో హాలీవుడ్ నటుడు కాల్చివేత

deadbody

ఠాగూర్

, సోమవారం, 27 మే 2024 (18:55 IST)
అమెరికాలో దుండగులు మరోమారు పెట్రేగిపోయారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ (37)ను కాల్చి చంపారు. ఆయన ప్రయాణిస్తున్న కారులో దోపిడీకి యత్నించిన అగంతకులు కాల్పులు జరపడంతో జానీ వాక్టర్ చనిపోయాడు. ఈ దారుణం శనివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో జరిగింది. లాస్ ఏంజిల్స్ డౌన్ టౌన్‌లో ఈ దుర్ఘటన జరిగినట్లు వాక్టర్ తల్లి స్కార్లెట్, పోలీసులు తెలిపారు.
 
ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వాక్టర్ కారు వద్ద కాటలిక్ట్ కన్వర్టర్‌ను దొంగిలిస్తుండగా ఎదురుతిరిగిన అతనిపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ వాక్టర్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్కార్లెట్ తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోగా పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదని పోలీసులు తెలిపారు.
 
ఇకపోతే, 2007లో వచ్చిన లైఫ్లైమ్ డ్రామా సిరీస్ 'ఆర్మీ వైవ్స్' అనే టీవీ షోతో జానీ వాక్టర్ తన కెరీర్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన 'వెస్ట్ వరల్డ్', 'ది ఓ', 'స్టేషన్ 19', 'క్రిమినల్ మైండ్స్', 'హాలీవుడ్ గర్ల్' వంటి విజయవంతమైన వెబ్ సిరీస్లు, పలు టీవీ షోలలో నటించాడు.
 
ముఖ్యంగా 'జనరల్ హాస్పిటల్' అనే షో జానీ వాక్టర్‌కు ఎనలేని గుర్తింపును తెచ్చి పెట్టింది. 1963లో ప్రారంభమైన ఈ షోలో ఆయన 2020 నుంచి 2022 వరకు దాదాపు 200 ఎపిసోడ్స్‌లో నటించాడు. అందులో ఆయన పోషించిన బ్రాండో కార్బిన్ క్యారెక్టర్ ఇప్పటికీ చాలా మందికి ఫెవరేట్. కాగా, జానీ వాక్టర్ మరణ వార్త విన్న తోటి నటులు, జనరల్ హాస్పిటల్ షో టీం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్ప 2 లో సెకండ్ సింగిల్ ను 6 భాషల్లో పాడిన మెలోడీ క్వీన్ శ్రేయఘోషల్