Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒంగోలులో కోవిడ్‌ పాజిటివ్‌.. మూడుకు చేరిన కేసులు

Advertiesment
coronavirus

సెల్వి

, బుధవారం, 10 జనవరి 2024 (19:22 IST)
ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సోమవారం కోవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో పట్టణంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడుకు చేరింది. ఒంగోలులోని లంబాడి డొంకకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వచ్చినట్లు జిజిహెచ్ ఒంగోలు సూపరింటెండెంట్ డాక్టర్ ఎం భగవాన్ నాయక్, సిఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ బి తిరుమలరావు తెలిపారు. 
 
RT-PCR పరీక్ష కోసం ఆదివారం అతని నమూనాను సేకరించారు. సోమవారం ల్యాబ్ ద్వారా ప్రకటించడం జరిగింది. కరోనా సోకిన వ్యక్తిని ఆసుపత్రిలోని కోవిడ్ స్పెషల్ వార్డుకు తరలించి, అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 
 
మార్కెట్లు, సినిమా హాళ్లు లేదా ప్రయాణాలు వంటి రద్దీ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని వైద్యులు ప్రజలను హెచ్చరించారు. ఇది పండుగ సీజన్ కాబట్టి, ప్రజలు మార్గదర్శకాలను పాటించాలని.. తమ కుటుంబాన్ని కోవిడ్ నుండి రక్షించుకోవాలని వారు కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులపై దాడి.. ఖండించిన ఎండీ సజ్జనార్