చైత్ర హత్యాచారం నిందితుడు రాజుది ఆత్మహత్యా? ఎన్‌కౌంటరా? నెటిజన్స్ ఏమంటున్నారో చూడండి

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (15:13 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
ఆరేళ్ల బాలిక చైత్ర హత్యాచార నిందితుడు రాజు కోసం గ‌త వారం రోజులుగా తెలంగాణా పోలీసులు వెతుకుతున్నారు. ఐతే అతడు చివ‌రికి రైలు ప‌ట్టాల‌పై శ‌వ‌మై తేలాడు. సైదాబాద్ హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్-ఘట్కేసర్ మార్గంలో స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృత దేహం కనిపించింది.
 
 
చిన్నారిపై అమానుషంగా హ‌త్యాచారం చేసిన రాజు క‌నిపిస్తే, ఆచూకీ అందిస్తే, 10 ల‌క్ష‌ల రూపాయ‌ల బ‌హుమ‌తిని కూడా తెలంగాణా పోలీసులు ప్ర‌కటించారు. మరోప‌క్క రాజుని ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని ప్ర‌జా సంఘాలు, చిన్నారి బంధువులు డిమాండు చేసారు. ఈ ద‌శ‌లో రాజు ప్రాణాల‌తో దొరికి ఉంటే, పెద్ద సంచ‌ల‌న‌మే అయ్యేది. కానీ, నిందితుడు రైలు ప‌ట్టాల‌పై శవ‌మై క‌నిపించ‌డంతో పోలీసులు ఆత్మ‌హ‌త్య‌ కేసు న‌మోదు చేస్తున్నారు.
 
ఐతే సోషల్ మీడియాలో మాత్రం భిన్నమైన కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. శభాష్ తెలంగాణ పోలీస్, బ్రహ్మాండంగా పనిచేసారని కొందరు అంటుంటే, తెలంగాణలో అత్యాచారం చేసినవాడికి శిక్ష వెంటనే పడిపోతుంది మరొకరు కామెంట్ చేసారు. మొత్తమ్మీద నిందితుడిది ఎన్‌కౌంటరా అనే కోణంలో మాట్లాడుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: వారణాసిని సందర్శించి దైవ ఆశీస్సులు తీసుకున్న అఖండ2 టీమ్

Chiranjeevi: మన శంకర వర ప్రసాద్ గారు లో మెగాస్టార్ స్టైలిష్ లుక్స్ విడుదల

Ram charan: మగధీర అంత హిట్ ఛాంపియన్ కూడా కావాలని కోరుకుంటున్నా : రామ్ చరణ్

Sara Arjun: సారా అర్జున్‌ నా కూతురులాంటిది.. చూసేవారి కళ్ళలోనే లోపం ఉంది - రాకేష్ బేడీ

కేజీఎఫ్ కో డైరక్టర్ కీర్తన్ కుమారుడి మృతి.. సంతాపం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

2035 నాటికి భారతదేశాన్ని తలసేమియా రహితంగా మార్చడమే లక్ష్యం

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments