Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేశ్యను 140 సార్లు కత్తితో పొడిచిన ప్రవాస భారతీయుడు... జీవితశిక్షను ఖరారు చేసిన కోర్టు

వరుణ్
మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (10:14 IST)
లండన్‌లో గత 1994లో ఓ వేశ్య హత్యకు గురైంది. ఈమె ప్రవాస భారతీయుడు దారుణంగా హత్య చేశాడు. ఏకంగా 140 సార్లు కత్తితో పొడిచాడు. ఈ కేసులో ముద్దాయిగా మారిన ఎన్నారైకు కోర్టు జీవిత శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఆధునిక ఫారెన్సిక్ సాంకేతికతతో సందీప్ పటేల్ ఈ హత్య చేసినట్టు తేలడంతో ఆయనకు కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 1994లో లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ ప్రాంతంలో మరీనా కొప్పల్ (39) అనే మహిళ అత్యకు గురైంది. మసాజ్ థెరపిస్టుగా ఉన్న ఆమె వేశ్యావృత్తిలోనూ ఉంది. ఆమె జీవితం గురించి భర్తకు పూర్తిగా తెలుసు. ఆ దంపతులకు పిల్లలు కూడా ఉన్నారు. 
 
నగరంలో తన ఫ్లాట్ ఉండే ఆమె, వారాంతాల్లో తన భర్తా పిల్లల వద్దకు వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో గత 1994లో ఓ వారాంతంలో మరీనా ఎంతకీ ఇంటికి రాకపోవడంతో భర్తకు అనుమానం మొదలైంది. దీంతో, మరీనా ఫ్లాటు వెళ్లి చూడగా ఆమె రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమెను 140 సార్లు పొడిచి హత్య చేసినట్టు నిర్ధారించారు. అప్పట్లోనే సందీప్ పటేల్‌పై అనుమానాలు వ్యక్తమైనా అతడి నేరం రుజువు చేసే బలమైన సాక్ష్యాలేవీ లభించలేదు.
 
బాధితురాలిని సందీప్ ఆమె ఫ్లాట్‌లోనే పొడిచి చంపేశాడు. ఘటనా స్థలంలో సందీప్ పాదముద్రలు లభించినా అతడే దోషి అని నిర్ద్వంద్వంగా తేల్చే సాక్ష్యాలు చాలాకాలం పాటు లభించలేదు. అయితే, అప్పట్లో మృతురాలి ఉంగరానికి చుట్టుకుని ఉన్న వెంట్రుక పోలీసులకు లభించింది. దీన్ని విశ్లేషించే సాంకేతికత అందుబాటులో లేక కేసు ఓ మిసర్టీగా మారింది. ఈ క్రమంలో 2022లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఫారెన్సిక్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీని సాయంతో వెంట్రుకను పరీక్షించిన ఫారెన్సిక్ నిపుణులు సందీప్ ఈ హత్య చేసినట్టు రుజువు చేశారు. దీంతో, అతడికి తాజాగా జీవిత ఖైదును ఖరారు చేస్తూ కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అగాతియా నుంచి జీవా, రాశి ఖన్నాలపై ఫస్ట్ సింగిల్ గాలి ఊయలలో.. రిలీజ్

సినీ జర్నలిజాన్నే గౌరవంగా భావించి ఎదిగిన బి ఏ రాజు- 65వ జయంతి

గేమ్ చేంజర్ నా ఆలోచనాధోరణి మార్చింది - చిరంజీవి ప్రశంస నేషనల్ అవార్డు : అంజలి

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లో కథ చెప్పేసిన అనిల్ రావిపూడి - ప్రివ్యూ

పబ్లిక్‌గా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పడాన్ని చూసి పాదాభివందనం చేయాలనిపించింది: దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments