Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేపాల్‌ను భయపెడుతున్న వరుస భూకంపాలు

earthquake
, మంగళవారం, 24 అక్టోబరు 2023 (09:51 IST)
నేపాల్ దేశాన్ని వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. రెండు రోజు క్రితం ఆ దేశ రాజధాని ఖాట్మండులో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదృష్టవశాత్తు ఆస్తి, ప్రాణనష్టం తప్పడంతో అందురూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఈ తెల్లవారుజామున 4.17 గంటలకు 4.1 తీవ్రతతో భూమి కంపించింది. వరుస భూకంపాలతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి వీధుల్లోనే గడుపుతున్నారు. ఖాఠ్మాండుకు ఉత్తర, ఈశాన్యం దిశగా 393 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. 
 
తాజా భూకంపంలోనూ ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు ఇప్పటివరకు అందలేదు. టిబెటన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే నేపాల్ భూకంపాలు సర్వసాధరణంగా మారాయి. శతాబ్దానికి ఒకసారి ఈ రెండు ప్లేట్లు ఒకదానికొకటి రెండుమీటర్ల మేర దగ్గరకు జరుగుతుండడంతో ఒత్తిడి ఏర్పడి భూకంపాలు సంభవిస్తున్నాయి. 2015లో ఇక్కడ 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం పెను ప్రళయాన్నే సృష్టించింది. ఈ భూకంపంలో దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మిలియన్ నిర్మాణాలు కుప్పకూలాయి. అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో ప్రపంచంలో నేపాల్ 11వ స్థానం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీధి కుక్కల దాడిలో గాయపడిన ప్రాణాలు కోల్పోయిన వాఘ్ బక్రీ టీ యజమాని