Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ ప్రియుడుని 20 సార్లు కత్తితో పొడిచిన భర్త!!

ఠాగూర్
సోమవారం, 24 మార్చి 2025 (10:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్‌లో ఓ దారుణ ఘటన జరిగింది. తన భార్యతో అక్రమం సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ప్రియుడుని ఆ మహిళ భర్త 20 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. రెండు రోజుల క్రితం తర్వాత ఈ ఉదంతం వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లఖింపూర్‌కు చెందిన ఓ వ్యక్తి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ క్రమంలోనే తన భార్యతో ప్రియుడు మనోజ్‌కు ఫోన్ చేయించాడు. దీంతో ప్రియురాలిని కలుసుకునేందుకు మనోజ్ ఆమె వద్దకు రాగా, మహేంద్ర కుమార్ తన వద్ద తుపాకీకి ఉండే కత్తితో దాదాపు 20 సార్లు పొడిచాడు. దీంతో మనోజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, మనోజ్ స్నేహితుడు రోహిత్ లోధిని కూడా కానిస్టేబుల్ చంపేశాడు. ఈ రెండు మృతదేహాలను లఖింపూర్ నాగ్వా వంతెన సమీపంలో పడేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 
 
ఈ హత్యలను కానిస్టేబుల్ ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి చంపాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మనోజ్ శరీరంపై 20 కత్తిపోట్లు ఉండగా, స్నేహితుడు రోహిత్ మెడపై ఒక గాయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో నిందితుడు భార్యకు కూడా గాయాలయ్యాయి. ప్రియుడిపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఆమె వేలుకు ఛాపర్ తగిలి తెగిపోయింది. ఈ ఘటన తర్వాత మహేంద్ర కుమార్ లఖింపూర్ నుంచి పారిపోయాడు. అయితే, మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా, అతని భార్యను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments