Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానం.. సహజీవన భాగస్వామిని కుక్కర్‌తో కొట్టి చంపాడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (13:08 IST)
బెంగుళూరులో అద్దెకు తీసుకున్న ఇంట్లో ప్రెషర్ కుక్కర్‌తో తన లైవ్-ఇన్ భాగస్వామిని కొట్టి చంపినందుకు 29 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన భాగస్వామి తనను మోసం చేసిందనే అనుమానంతో ఇద్దరు గొడవకు దిగారు. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
 
వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన వైష్ణవ్, దేవా(24)లు బెంగళూరులో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వారు కళాశాల నుండి ఒకరికొకరికి పరిచయం. ప్రస్తుతం వీరిద్దరూ బెంగళూరులోని కోరమంగళలోని సేల్స్, మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తున్నారు. శనివారం జరిగిన గొడవలో వైష్ణవ్.. దేవాను ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి హత్య చేశాడు. దేవా సోదరి ఫోన్‌లో రాకపోవడంతో ఇరుగుపొరుగు వారిని సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.
 
"వైష్ణవ్‌కు తన భాగస్వామిపై కొన్ని సందేహాలు ఉన్నాయి, దానిపై వారు గొడవపడ్డారు. శనివారం ఇది మళ్లీ జరిగింది, అతను మహిళను కుక్కర్‌తో కొట్టాడు" అని దక్షిణ బెంగళూరు సీనియర్ పోలీసు అధికారి సీకే బాబా తెలిపారు. 
 
సంఘటన తర్వాత వైష్ణవ్ పరారీలో వున్నాడు. అయితే పోలీసులు అతనిని ట్రాక్ చేసి అరెస్టు చేశారు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్న విషయం వారి తల్లిదండ్రులకు తెలిసిందని పోలీసులు గుర్తించారు. 
 
భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. వైష్ణవ్‌పై హత్య కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments