చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సహజమేనని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందేనంటూ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ అన్నారు. అయితే, ఇలాంటి అనుభవాలు ఎదురైనపుడు కుటుంబ సభ్యుల సహకారం, మద్దతుతో ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. క్యాస్టింగ్ కౌచ్ కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైతే మాత్రం కుటుంబ అండ తీసుకోవాలని సూచించారు.
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది బహిరంగ రహస్యమే. తాము లైంగిక వేధింపులకు గురయ్యామంటూ ఇప్పటికే అనేక మంది నటీమణులు బహిరంగంగా వ్యాఖ్యానించారు. తాజాగా ఈ జాబితాలో అనూ ఇమ్మాన్యుయేల్ కూడా చేరిపోయారు. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీంచాల్సిందేనని చెప్పారు. ఇలాంటి సమస్యలు ఎదురైనపుడే ధైర్యంగా ముందుకు సాగాలని, అవసరమైతే కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలని ఆమె హితవు పలికారు. ఒత్తిడికి గురైనపుడు కుటుంబ సభ్యులతో చెప్పి వారి అండ తీసుకోవాలని సూచించారు.
26 యేళ్ల అను ఇమ్మాన్యుయేల్ గత 2011లో బాల నటిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. నేచరుల స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను చిత్రంలో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించారు.