Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

సెల్వి
బుధవారం, 18 జూన్ 2025 (19:58 IST)
ప్రేమికుడిని నమ్మింది. అతనిని వివాహం చేసుకోవాలనుకుంది. కానీ ఆ యువతిని ప్రేమికుడే హత్య చేసిన ఘటన గోవాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఉత్తర బెంగళూరుకు చెందిన సంజయ్ కెవిన్ ఎం (22), అదే ప్రాంతానికి చెందిన రోష్ని మోసెస్ ఎం (22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
 
పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఇటీవల బెంగళూరు నుంచి గోవాకు వెళ్లారు. అయితే, అక్కడ వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, సంజయ్, రోష్నిని హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని గోవాలోని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతాల్లో పడేసి పారిపోయాడు. 
 
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలంలో రోష్నీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆపై కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. విచారణలో ఆమె ప్రేమికుడు సంజయ్ నిందితుడని గుర్తించారు.
 
హత్య వెలుగుచూసిన 24 గంటల్లోపే సంజయ్ ఆచూకీని బెంగళూరులో కనిపెట్టి అరెస్టు చేశారు.  ప్రేమ సంబంధం, పెళ్లి ప్రతిపాదనతో వచ్చిన గొడవ కారణంగా ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కార్మికులకు వేతనాలు పెంచే అవకాశం లేదు : మైత్రీ మూవీస్ నవీన్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments