Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా అవకాశం పేరుతో మహిళపై అత్యాచారం చేసిన అసిస్టెంట్ డైరెక్టర్

ఐవీఆర్
శనివారం, 18 జనవరి 2025 (12:54 IST)
సినిమా అవకాశాల కోసం ఎంతోమంది ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో మహిళలకు అవకాశాలు రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గతంలో క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఎంతోమంది నటీమణులు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను చెప్పారు. తాజాగా సినీ అవకాశం కోసం వచ్చిన ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ అసిస్టెంట్ డైరెక్టర్.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఆంధ్రకు చెందిన 32 ఏళ్ల మహిళ తన భర్తతో విడిపోయి మణికొండలో హౌస్ కీపింగ్ పనిచేస్తూ అక్కడికి 15 రోజుల క్రితమే వచ్చింది. ఈమెకి సినిమాల్లో నటించాలనే ఆకాంక్ష వున్నది. ఆమె అమీర్ పేటలో ఓ హాస్టల్లో నివాసం వుంటోంది. జూనియర్ సినీ ఆర్టిస్ట్ కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆమెకి అసిస్టెంట్ డైరెక్టర్ రాజు అనే వ్యక్తితో పరిచయం కలిగింది.
 
ఆమెకి అవకాశాలను ఇప్పిస్తాననీ, ఫోటోషూట్ చేయాలంటూ కృష్ణానగర్ లోని ఓ ప్రముఖ హోటలుకి రమ్మని పిలిచాడు. అతడు చెప్పిన మాటల ప్రకారం ఆమె అక్కడికి వెళ్లింది. ఆమెను ఫోటోషూట్ చేసి అక్కడి నుంచి పంపించి వేసాడు. మరుసటిరోజు అదే హోటల్ గదికి రావాల్సిందిగా చెప్పాడు. అక్కడికి వెళ్లిన ఆమెపై రాజు లైంగిక దాడి చేసాడు. దీనితో బాధితురాలు శుక్రవారం నాడు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం