బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ దాడి కూడా ఆయన నివాసంలోనే జరగడం గమనార్హం. గురువారం వేకువజామున 2.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంట్లోకి ప్రవేశించి రెండుమూడుసార్లు కత్తితో పొడిచారు. ఈ దాడిలో గాయపడిన సైఫ్‌ను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. నిందితులు గురువారం తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించి కత్తితో పొడిచాడని, ఆ తర్వాత అతన్ని లీలావతి ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. గతంలో కూడా మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై దాడి చేసేందుకు రెక్కీ నిర్వహించిన విషయం తెల్సిందే.
ఇపుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరగడం గమనార్హం. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ఘటన ముంబై మహానగరంలో శాంతిభద్రతల సమస్యను తేటతెల్లం చేస్తుంది. ఇది బీజేపీ పాలకులకు తలవంపు వంటిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.