Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార నిందింతులకు ప్రజాప్రతినిధి ఆశ్రయం

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (15:38 IST)
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన కేసులోని నిందింతులకు ఓ ప్రజాప్రతినిధి తన ఫామ్ హౌస్‌లో ఆశ్రయం కల్పించినట్టు వార్తలు వస్తున్నాయి. శనివారం రాత్రి కర్నాటకలోని గుల్బర్గాలో ఉన్న ఒక మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఆ కుర్రోడిని ఓ రహస్య ప్రాంతానికి తరలించి విచారించారు. అలాగే, మరో నిందితుడిని కూడా అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టు చేసిన నిందితుల సంఖ్య ఐదుకు చేరిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లో ఉన్న ఒక ఫాంహౌస్‌లో వద్ద ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఓ రాజకీయ పార్టీ నేతకు చెందిన ఫాంహౌస్‌లోనే తలదాచుకున్నారని, అక్కడ నుంచి వేర్వేరు ప్రాంతాలకు పరారయ్యారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పైగా, తాము వినియోగించిన ఇన్నోవా కారును కూడా ఆ ఫాంహౌస్ వెనుక భాగంలో వారు దాచిపెట్టారు. 
 
అంతేకాకుండా, అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఇద్దరికి కొత్త సిమ్ కార్డులు వేసి గోవాకు పంపించినట్టు తెలిపారు. ఆ తర్వాత మరికొందరు కర్నాటకకు పారిపోయారు. ఆశ్రయం ఇచ్చిన ఫాంహౌస్ యజమాని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో అరెస్టు చేసిన ఓ నిందితుడికి చెందిన ఫాంహౌస్‌గా భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments