Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం, ప్రేయసి గొంతు కోసి చంపి రాత్రంతా ఇంట్లోనే...

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (20:53 IST)
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఇద్దరిమధ్య ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ తన ప్రేయసిని తన ఇంట్లోనే గొంతుకోసి చంపేసాడు ప్రియుడు. ఆ తర్వాత ఆ రాత్రంతా అక్కడే గడిపాడు. తెల్లారేసరికి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
పూర్తి వివరాలను చూస్తే... ఏలూరులోని దక్షిణపు వీధిలో ఆదివారం రాత్రి సుజాత అనే మహిళను ఆమె ప్రియుడు అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేసాడు. ఆ తర్వాత అతడు కూడా నూజివీడు రైల్వే స్టేషను సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణ సూసైడ్ కేసు సమాచారం అందుకున్న పోలీసులు అతడి ఇంటి వద్దకు వెళ్లారు. ఇంటి తలుపులు తెరిచే వుండటంతో లోపలికి వెళ్లి చూడగా ఓ మహిళ రక్తపు మడుగులో శవంగా కనిపించింది. ఈ హత్యపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కారణంగా ఇది జరిగిందా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. మరోవైపు మృతురాలి బంధువు, సుజాత ఆదివారం మధ్యాహ్నం ఇంటికెళ్లి భోజనం చేసి వస్తానని చెప్పి వెళ్లిందనీ, ఆ తర్వాత షాపుకి రాలేదన్నారు. ఇంటికేమైనా వచ్చిందేమోనని ఆరా తీస్తే అక్కడికి రాలేదని తెలిసింది. ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీనితో తమకు అనుమానం వచ్చి, సత్యనారాయణ అనే వ్యక్తికి ఫోన్ చేస్తే.... సుజాతకి తనకి గొడవైందనీ, ఆమె గురించి తనకు తెలియదని చెప్పాడు.
 
ఐతే సత్యనారాయణ ఆ రాత్రంతా ఇంట్లోనే వున్నట్లు అనుమానిస్తున్నారు. తెల్లారాక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో సుజాత హత్య బయటకు వచ్చింది. ఈ హత్యోదంతం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments