Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడవపడి అర్థరాత్రి ఇంటి నుంచి వచ్చిన వివాహిత... బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (09:36 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ వివాహిత సామూహిక అత్యాచారానికి గురైంది. కుటుంబ సభ్యులతో గొడవపడి అలిగి ఇంటి నుంచి అర్థరాత్రి సమయంలో బయటకు వచ్చింది. రోడ్డుపై ఒంటరిగా నిలబడివున్న ఆ వివాహితను ఓ ఆటో డ్రైవర్ బలవంతంగా లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అతనితో పాటు మరో ఇద్దరు మృగాళ్లు కలిసి ఈ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వరంగల్ జిల్లా హన్మకొండలో వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. హన్మకొండ కిషన్‌పురకు చెందిన ఓ వివాహిత ఇంట్లో గొడవపడి గత నెల 27వ తేదీ అర్థరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. హన్మకొండ నయీం నగర్‌లో రంగ్ బార్ రోడ్డుపై నిలబడివుండగా, ఆ సమయంలో కేయూసీ వైపు వెళుతున్న భీమవరానికి చెందిన ఆటో డ్రైవర్ రాకేశ్.. అర్థరాత్రి రోడ్డు ఒంటరిగా నిల్చొనివున్న వివాహితను చూశాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నాడు.
 
ఒకవైపు ఆటోను డ్రైవింగ్ చేస్తూనే మరోవైపు భీమవరానికి చెందిన తన స్నేహితులు సతీష్, సనత్‌లకు ఫోనులో సమాచారం ఇవ్వడంతో వారు కూడా కేయూసీ క్రాస్ రోడ్డుకు చేరుకున్నారు. వారిని ఆటోలో ఎక్కించుకుని శివారు ప్రాంతంలోని చెరువు వద్దకు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి, అక్కడ ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాధితురాలిని తీసుకొచ్చి మెయిన్ రోడ్డులో వదిలేసి వెళ్లిపోయారు. దీనిపై బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments