Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తను వదిలి ప్రియుడితో వివాహిత జంప్ ... చెరకు తోటలో శవం లభ్యం

Advertiesment
murder
, బుధవారం, 14 డిశెంబరు 2022 (13:50 IST)
కర్నాటక రాష్ట్రంలో పెళ్లయిన నాలుగు నెలలకే కట్టుకున్న భర్తను వదిలేసి తన ప్రియుడితో పారిపోయిన ఓ మహిళ చివరకు చెరకు తోటలో శవమై కనిపించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని హాసన్ జిల్లా హోళెనరసిపుర తాలూకా పరసనహళ్లి గ్రామానికి చెందిన కావ్య (23) అనే యువతికి హాసన్‌కు చెందిన ఓ యువకుడితో తల్లిదండ్రులు వైభవంగా పెళ్లి చేశారు. అయితే, వివాహమైన నాలుగు నెలలకే ఆమె తన భర్తను వదిలివేసి ప్రియుడు అవినాశ్‌తో కలిసి పారిపోయింది. అవినాశ్ ఎలాంటి పని చేయకుండా ఇంటిపట్టునే ఉంటే జులాయిగా తిరిగేవాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం ఆమె ప్రియుడు స్థానిక పోలీసులను కలిసి కావ్య చెరకుతోటలో చనిపోయివుందని సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత వారంతా కలిసి చెరకుతోటకెళ్లి చూడగా, కావ్య మృతదేహం కనిపించింది. అయితే, కొంతమేరకు పాతిపెట్టివున్న మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రియుడే తమ కుమార్తెను హత్య చేసివుంటాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో దారుణం... 17ఏళ్ల బాలికపై దుండగుల యాసిడ్ దాడి