Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో మహిళ పరిచయం.. ఆస్పత్రికి పిలిచి మరో ఇద్దరితో కలిసి వైద్యుడు రేప్

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (10:23 IST)
సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళను ఆస్పత్రికి పిలిచిన వైద్యుడు.. మరో ఇద్దరు వైద్యులతో కలిసి ఆస్పత్రిలోనే అత్యాచారం చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీలో ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొత్వాలి ప్రాంతంలోని బస్తీ సదర్ ఆస్పత్రిలో పని చేసే ఓ వైద్యుడికి సోషల్ మీడియా ద్వారా ప్రైవేటు విద్యా సంస్థలో పని చేసే మహిళా ఉపాధ్యాయురాలితో పరిచయమైంది. అలా ఏర్పడిన పరిచయం కాస్త చనువుగా మారింది. ఈ క్రమంలో ఓ సారి తన ఆస్పత్రికి రావాలంటూ ఆమెను వైద్యుడు కోరాడు. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. 
 
అక్కడ నుంచి ఆమెను ఓ హాస్టల్ గదికి తీసుకెళ్లిన ఆ వైద్యుడు.. మరో ఇద్దరు సహచర వైద్యులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెల 27వ తేదీన ఈ ఘటన జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments