Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ చెప్పింది చేశాను.. అందుకే మ్యాజిక్ జరిగింది: షమీ (video)

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (15:12 IST)
ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టిన మహ్మద్ షమీ.. ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పినట్లు చేయడం వల్లే మ్యాజిక్ జరిగిందని.. చెప్పుకొచ్చాడు. భారత్-ఆప్ఘనిస్థాన్‌ల మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ శనివారం జరిగిన సంగతి తెలిసిందే.


ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని చేధించే దిశగా ఆప్ఘనిస్థాన్ బరిలోకి దిగింది. ఒక దశలో ఆప్ఘనిస్థాన్ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. 
 
కానీ చివరి నాలుగు ఓవర్లు బుమ్రా, చివరి ఓవర్ మహ్మద్ షమీ బౌలింగ్ చేశారు. వీరిద్దరి పుణ్యమా అంటూ భారత్ ఆప్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయగలిగింది. దీంతో భారత్ 11 పరుగుల తేడాతో పోరాడి గెలిచింది.

గత 1987వ సంవత్సరంలో న్యూజిలాండ్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో.. భారత ఫాస్ట్ బౌలర్ శర్మ హ్యాట్రిక్ కొట్టాడు. ఆ తర్వాత 32 సంవత్సరాలకు తర్వాత.. ప్రపంచకప్ చరిత్రలో షమీ హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టాడు. దీనిపై షమీ స్పందిస్తూ.. రెండు వికెట్లు పడగొట్టిన తర్వాత ధోనీ తన వద్దకు వచ్చాడు. 
 
ఈ వ్యూహంలో ఎలాంటి మార్పు చేయొద్దని చెప్పాడని.. ఇంకా హ్యాట్రిక్ సాధించే అవకాశం కూడా వుందని చెప్పాడు. ఇలాంటి అవకాశాలు లభించడం అరుదు.. కాబట్టి వ్యూహంలో ఎలాంటి మార్పు లేకుండా ముందుకు దూసుకెళ్లండి అంటూ ప్రోత్సాహించాడని షమీ చెప్పుకొచ్చాడు. యార్కర్ బంతులేయమని ధోనీ చెప్పడంతో తాను కూడా అదేవిధంగా యార్కర్ విసిరానని.. అలా హ్యాట్రిక్ కొట్టానని షమీ వెల్లడించాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments