Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ ఢమాల్.. 105 పరుగులకే కుప్పకూలింది..

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (17:44 IST)
వన్డే ప్రపంచకప్ టోర్నీని పాకిస్థాన్ జట్టు చెత్తగా ఆరంభించింది. ఈరోజు పాక్ జట్టు వెస్టిండీస్ జట్టుతో తలపడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ అతి తక్కువ స్కోర్‌కే ఆలౌటైంది. మ్యాచ్‌లో కనీసం సగం ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేక చేతులెత్తేసింది. కేవలం 21.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి పాక్ విలవిల్లాడింది. 
 
ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ స్పూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడలేదు. పాక్ బ్యాట్స్‌మెన్‌లలో చాలా మంది రెండంకెల స్కోర్‌ను కూడా నమోదు చేయలేకపోయారు. పాక్ ఇన్నింగ్స్‌లో విండీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసారు. ప్రతి ఓవర్లోనూ తెలివైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ని బోల్తా కొట్టించారు. విండీస్ బౌలర్‌లలో ఒషానే థామస్(4),జాసన్ హోల్డర్(3), ఆండ్రీ రస్సెల్(2) గొప్పగా బౌలింగ్ చేసి పాక్‌ను కుప్పకూల్చారు.
 
వరల్డ్‌కప్ హిస్టరీలో పాక్ తన దారుణ బ్యాటింగ్ వైఫల్యంతో చెత్త రికార్డ్‌లను నమోదు చేసింది. ఫకార్ జమాన్(22), బాబర్ అజామ్(22), మహ్మద్ హఫీజ్(16), వాహబ్ రియాజ్(18) మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోర్ సాధించలేదు. మెగా టోర్నీలో పాక్ తన ప్రారంభ మ్యాచ్‌లో ఇలా ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. పోరాట పటిమతో ఆడాల్సిన స్థితిలో చేతులెత్తేయడమే కాకుండా పెవిలియన్‌కి ఎప్పుడెప్పుడు చేరదామా అన్నట్లు పాక్ ఇన్నింగ్స్ సాగింది.
 
ఆఖర్లో హోల్డర్ బౌలింగ్‌లో వహాబ్ రియాజ్ రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాది 17 పరుగులు రాబట్టాడు. పాక్ బ్యాట్స్‌మెన్‌లలో టాప్ ప్లేయర్స్ అయిన ఇమామ్ ఉల్ హక్(2), హారీస్ సొహైల్(8), సర్ఫరాజ్ అహ్మద్(8), మహ్మద్ హఫీజ్(16) అందరూ విఫలమయ్యారు. మరోవైపు విండీస్ బ్యాట్స్‌మెన్ ఓవర్‌కు రెండు పరుగుల సాధించినట్లయితే అలవోక విజయాన్ని నమోదు చేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

ఏఆర్.రెహ్మాన్ తండ్రిలాంటివారు... ఆ సంబంధం అంటగట్టొద్దు ప్లీజ్ : మోహిని డే

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

తర్వాతి కథనం
Show comments