Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ ముంగిట ప్రపంచ రికార్డు.. తొలి వికెట్ కీపర్‌గా...

Webdunia
బుధవారం, 10 జులై 2019 (11:12 IST)
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్‌గా సేవలు అందిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ముంగిట ప్రపంచ రికార్డువుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ధోనీ ఇన్నింగ్స్ ఆడితో ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నట్టే. 
 
ఆ రికార్డు ఏంటంటే.. 350 వన్డే మ్యాచ్‌లు ఆడిన తొలి వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డు సృష్టించనున్నాడు. అయితే, శ్రీలంక వికెట్ కీపర్ కుమార సంగక్కర 360 వన్డేలు ఆడాడు. కానీ, వీటిలో 40 మ్యాచ్‌లకు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌గా సేవలు అందించాడు. అంటే సంగక్కర వికెట్‌ కీపర్‌గా ఆడిన మ్యాచ్‌ల సంఖ్య 320 మాత్రమే. అందువల్ల 350 వన్డేలు ఆడిన తొలి వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డు నెలకొల్పనున్నాడు. 
 
అంతేకాకుండా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్‌గా కూడా ధోనీ రికార్డు నెలకొల్పనున్నాడు. సచిన్ 463 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత మహేళ జయవర్ధనే 448, జయసూర్య 445, కుమార సంగక్కర 404, షాహిద్ ఆఫ్రిది 398, ఇంజమామ్ 378, రికీ పాంటింగ్ 375, వసీం అక్రమ్ 356, ముత్తయ్య మురళీధరన్ 350 చొప్పున వన్డేలు ఆడారు. సో.. సచిన్ తర్వాత అత్యధిక వన్డేలు ఆడిన భారత క్రికెటర్‌గా ధోనీ చరిత్ర సృష్టించనున్నాడు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments