టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. కోహ్లీ అవుట్

Webdunia
మంగళవారం, 28 మే 2019 (17:21 IST)
వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత్ ఇవాళ బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా భారత్ తన తొలి వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. 
 
భారత్ రెండవ మ్యాచ్‌లో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. కేదార్ జాదవ్ ఇంకా ఫిట్‌గా లేడని కోహ్లీ తెలిపాడు. ఇంగ్లండ్ చేరుకున్న రెండు రోజుల్లోనే వార్మప్ మ్యాచ్ ఆడాల్సి వచ్చిందని, అందువల్లే సరిగా ఆడలేకపోయామని కోహ్లీ చెప్పాడు. కార్డిఫ్‌లోని సోషియా గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
 
ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. అర్ధశతకానికి చేరువలో ఉన్న కెప్టెన్‌ కోహ్లీ (46 బంతుల్లో ఐదు ఫోర్లతో 47 పరుగులు)ని సైఫుద్దీన్‌ చక్కటి యార్కర్‌తో బౌల్డ్‌చేశాడు. అంతకు ముందు ధావన్‌(1), రోహిత్‌శర్మ(19) తక్కువ పరుగులకే ఔటయ్యారు.

దీంతో టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్‌ రాహుల్‌(13), విజయ్‌శంకర్‌ ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Davos: జనవరి 19 నుంచి జనవరి 23 వరకు చంద్రబాబు దావోస్ పర్యటన

మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్లను వద్దనే వద్దంటున్న కంపెనీ

తల్లి కళ్ళెదుటే ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు...

Harish Rao: ఆంధ్రాలో స్విచ్ వేస్తే, తెలంగాణలో బల్బ్ వెలుగుతుంది.. హరీష్ రావు

రోడ్డుకు అడ్డంగా బైకులు పార్క్ చేశారు.. తీయమన్నందుకు డ్రైవర్ గొంతు కోశారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

తర్వాతి కథనం
Show comments