ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్‌కు గాయం.... వరల్డ్‌ కప్‌కు దూరమా?

శనివారం, 25 మే 2019 (10:17 IST)
మరో ఆరు రోజుల్లో ప్రపంచకప్ ఆరంభంకానుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ మెగా టోర్నీకి ముందు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రపంచకప్ ఆరంభానికి ముందు గాయపడటం ఆ జట్టును బాగా కలవరపెడుతోంది. ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా శుక్రవారం క్యాచింగ్ డ్రిల్స్ చేస్తుండగా మోర్గాన్ గాయపడ్డాడని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) ఒక ప్రకటనలో పేర్కొంది. 
 
శుక్రవారం ఉదయం ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఎడమచేతి వేలికి గాయమైంది. అయితే వెంటనే ముందస్తు జాగ్రత్తగా హాస్పిటల్‌కి తీసుకెళ్లి ఎక్స్-రే తీయించినట్లు ఈసీబీ వెల్లడించింది. కాగా సన్నాహక మ్యాచ్‌లలో భాగంగా ఇంగ్లండ్ జట్టు శనివారం నాడు సౌతాంప్టన్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు మే 30న సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పాల్గొననుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వరల్డ్‌కప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ప్రారంభం..