వరల్డ్‌కప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ప్రారంభం..

శుక్రవారం, 24 మే 2019 (18:50 IST)
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ సమరం మరో ఆరు రోజుల్లో ఆరంభంకానుంది. ఇప్పటికే 10 జట్లు ఇంగ్లండ్‌కు చేరుకున్నాయి. భారత జట్టు కూడా ఈనెల 22వ తేదీన ఇంగ్లండ్ పయనమైంది. 
 
కాగా మెగా టోర్నీ ప్రారంభానికి ముందు టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఇవాళ రెండు సన్నాహక మ్యాచ్‌లు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యాయి.
 
బ్రిస్టల్‌లో పాకిస్థాన్‌తో ఆప్ఘనిస్థాన్‌ తలపడుతుండగా.. కార్డిఫ్‌లో సౌతాఫ్రికాతో శ్రీలంకను ఢీకొంటోంది. టీమిండియా తన మొదటి మ్యాచ్‌ను శనివారం నాడు న్యూజిలాండ్ జట్టుతో ఆడనుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రపంచ కప్ పోటీలు.. 500 పరుగుల మార్క్.. ఇంగ్లండ్‌కే సొంతం.. కోహ్లీ