Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్ పోరు : కోహ్లీ ఔట్.. కష్టాల్లో భారత్

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (17:16 IST)
సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ టెస్ట్ చాపింయన్‌షిప్ టైటిల్ తుదిపోరులో భారత్ కష్టాల్లో పడింది. మూడో రోజైన ఆదివారం ఆట ఆరంభంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ చేజార్చుకుంది. 44 పరుగులు చేసిన కోహ్లీ కివీస్ పేసర్ కైల్ జేమీసన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 
 
ప్రస్తుతం భారత్ స్కోరు 4 వికెట్లకు 149 పరుగులు కాగా, క్రీజులో అజింక్యా రహానే (32), రిషబ్ పంత్ ఉన్నారు. కాగా, వరుణుడు ఆదివారం ఆటపైనా ప్రభావం చూపాడు. వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైంది.
 
భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ 34, శుభ్ మాన్ గిల్ 28 పరుగులు చేశారు. పుజారా 8 పరుగులకే అవుట్ కాగా, కోహ్లీ-రహానే జోడీ కీలక భాగస్వామ్యంతో జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. 
 
ఈ జోడీని జేమీసన్ విడదీశాడు. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకోవడం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. కానీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments