Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్‌లో టీమిండియా కథ ముగిసింది.. ధోనీ, జడ్డూ అవుట్‌తో ఇంటికి..

Webdunia
బుధవారం, 10 జులై 2019 (19:38 IST)
2019 ప్రపంచ కప్ చేజారిపోయింది. టీమిండియా జట్టు తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. కీలక వికెట్లు ఆదిలోనే టపా టపా పడిపోవడంతో.. పరుగులు సాధించే బ్యాట్స్‌మెన్లే కరువయ్యారు. అలాంటి సమయంలో ధోనీ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును సంపాదించి పెట్టాడు. నిలకడగా ఆడుతూ జడేజా కీలక భాగస్వామ్యం అందించాడు. 
 
అయితే కీలక సమయాల్లో జడేజా, ధోనీ కూడా కివీస్ బౌలర్ల చేతికి చిక్కడంతో.. ధోనీ ఆటతీరుతో భారత్ గెలుపును నమోదు చేసుకుంటుందని ఆశగా ఎదురుచూసిన భారత క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. ఫలితంగా 18 పరుగుల తేడాతో భారత సేన.. కివీస్ చేతిలో పరాజయం పాలై.. ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది. 
 
కివీస్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ షాక్ ఇచ్చాడు. నాలుగు బంతులు ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ (1; 4 బంతుల్లో) ఒక్క పరుగు మాత్రమే చేసి కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ వేసిన 2.4వ బంతిని ఆడే క్రమంలో కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (1; 6 వికెట్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. విరాట్ సమీక్ష కోరినా.. ఫలితం లేకుండా పోయింది.
 
దీని నుంచి తేరుకోకముందే మాట్‌ హెన్రీ మరో షాక్ ఇచ్చాడు. హెన్రీ వేసిన 3.1వ బంతికి కేఎల్‌ రాహుల్‌ (1; 7 బంతుల్లో) ఔటయ్యాడు. కీపర్ టామ్‌ లేథమ్‌ అద్భుత క్యాచ్‌ పట్టాడు. దీంతో టీమిండియా 5 పరుగులకే కీలక ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇది చాలదన్నట్టు భాద్యతగా ఆడాల్సిన దినేష్ కార్తీక్ (6; 25బంతుల్లో) ఔట్ అయ్యాడు. 
 
మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో జేమ్స్ నీషమ్‌ సూపర్‌ క్యాచ్‌ పట్టడంతో కార్తీక్‌ పెవిలియన్ చేరాడు. దీంతో 24 పరుగులకే కీలక నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం రిషబ్ పంత్‌, హార్దిక్ పాండ్యాలు ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉన్నారు. రిషబ్ పంత్‌ (31), హార్దిక్ పాండ్యా (22)లు క్రీజులో ఉన్నారు. భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. 
 
ఆపై బరిలోకి దిగిన ధోనీ అర్థ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 72 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. కానీ గుప్తిల్ బంతికి రనౌట్ అయ్యాడు. ఆపై భువనేశ్వర్ కుమార్ (0), చాహెల్ (5), బుమ్రా (0) నాటౌట్‌గాలు రాణించలేకపోయారు. దీంతో భారత్ పరాజయం పాలైంది. కివీస్ బౌలర్లలో హెన్రీ 3, బోల్ట్ 2, సత్నర్ 2, నీషన్ ఒకటి, ఫెర్గూసన్ 1 వికెట్ సాధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

తర్వాతి కథనం
Show comments